Header Banner

జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించిన వైఎస్ జగన్! మళ్లీ తాడేపల్లి నుండి బెంగుళూరు ...

  Fri Feb 21, 2025 20:18        Politics

మాజీ సీఎం వైఎస్ జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లికి ఇటీవల వచ్చారు. అనంతరం జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించారు. ఆ తర్వాత గుంటూరు మార్కెట్ యార్డ్‌లో మిర్చి రైతులతో మాట్లాడారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేత మరణించడంతో.. ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన బెంగళూరు పయనమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలోని కేడర్ తన అభిప్రాయయాన్ని వ్యక్తం చేస్తోంది.

తాము అధికారంలో ఉన్న సమయంలో కరోనా వచ్చింది.. అందువల్ల ప్రజలతోనే కాదు.. పార్టీ కేడర్‌ను కలుసుకోలేక పోయాం. ఇకపై అలా జరగదు. ప్రజలతోపాటు, పార్టీ కార్యకర్తలతో నిరంతరం కలిసి ఉంటాం. ఇది ఇటీవల కేంద్ర పార్టీ కార్యాలయంలో ఓ జిల్లాకు చెందిన కేడర్‌తో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు. అలాంటి వేళ.. మళ్లీ వైఎస్ జగన్ బెంగళూరు వెళ్లి పోవడం ఏమిటనే ఓ చర్చ అయితే పార్టీ కేడర్‌లో కొనసాగుతోంది. తమతో పార్టీ అధినేత వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు వాస్తవమే.

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు!

కానీ ప్రస్తుతం పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. అలాంటి వేళ.. మళ్లీ ప్రజల మధ్యకు వెళ్లకుండా పార్టీ అధినేత జగన్.. ఇలా బెంగళూరు వెళ్లి పోవడం ఎంత వరకు సబబు అని కేడర్ ప్రశ్నిస్తోంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లు పార్టీకి వచ్చాయంటే.. అంతకుముందు పార్టీ అధినేత.. ప్రజల మధ్యకు వెళ్లడం, పాదయాత్ర, వైఎస్ ఫ్యామిలీ అన్ని గెలుపులో భాగంగా నిలిచాయని కేడర్ ఈ సందర్బంగా గుర్తు చేస్తోంది. కానీ 2024 ఎన్నికల నాటికి అవేమి లేవని వారు సోదాహరణగా పేర్కొంటుంది.

దీంతో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైందని చెబుతోంది. మరి అలాంటి వేళ... ప్రజల్లో ఉండాల్సిన, పార్టీ కేడర్‌తో మమేకం కావాల్సిన అధినేత ఇలా రాష్ట్రాన్ని వీడి మళ్లీ వెళ్లిపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తోంది. అధినేత పరిస్థితి ఇలాగే ఉంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఒక్క స్థానాన్ని సైతం కైవసం చేసుకునే పరిస్థితి ఉండదనే అనుమానం కలుగుతోందని స్పష్టం చేస్తుంది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అంతేకాదు.. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రతిపక్ష స్థానంలో ఉండి పోరాటం చేయాల్సిన వైసీపీ.. సైతం కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదని చెబుతోంది. అసెంబ్లీకి వెళ్లకున్నా.. రాష్ట్రంలో ఉండి నిరంతరం ప్రజా సమస్యలపై గళమెత్తాలని పార్టీ అధినేతకు సూచిస్తోంది. మరికొద్ది రోజల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాది పూర్తి కానుంది. ఈ ఏడాదిలో ఒకే ఒక్క రోజు అసెంబ్లీకి హాజరు కావడం.. అది కూడా ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి.. మళ్లీ అటువైపు చూడలేదని కేడర్ గుర్తు చేస్తోంది.

ఆ తర్వాత అసెంబ్లీకే కాదు.. ప్రజల మధ్యకు సైతం ఆయన వెళ్లలేదని అంటుంది. ఓ వేళ వెళ్లినా.. అది వేళ్లతో లెక్కించ వచ్చని చెబుతోంది. అదీకాక గతేడాది ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ జగన్ బెంగళూరులోనే అధికంగా ఉంటున్నారని కేడర్ స్పష్టం చేస్తుంది. పోని ఎన్నికల ముందు ప్రజల మధ్యకు వచ్చినా.. సమస్యల ఎదురైనప్పుడు అందుబాటులో లేకుండా.. ఇప్పుడా వచ్చేదంటూ ఓటర్ల నుంచ ఛీత్కారాలు ఎదురయ్యే అవకాశాలు సైతం ఉన్నాయని కేడర్ చెబుతోంది.

 

ఇటువంటి పరిస్థితుల్లో తాడేపల్లిలోనే ఉంటూ.. అటు ప్రజలకు ఇటు పార్టీ కేడర్‌కు అందుబాటులో ఉండాలని కేడర్ స్పష్టం చేస్తుంది. మరి పార్టీ కేడర్ మాటను వైఎస్ జగన్ పరిగణలోకి తీసుకుంటారా? లేకుంటే.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తారా? అనే ఓ చర్చ సైతం అమరావతిలో సాగుతోంది.

మాజీ సీఎం వైఎస్ జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లికి ఇటీవల వచ్చారు. అనంతరం జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించారు. ఆ తర్వాత గుంటూరు మార్కెట్ యార్డ్‌లో మిర్చి రైతులతో మాట్లాడారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేత మరణించడంతో.. ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన బెంగళూరు పయనమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలోని కేడర్ తన అభిప్రాయయాన్ని వ్యక్తం చేస్తోంది.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #appolitics #vallabanenivamsi #ysjagan